అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)తో భేటీ అయిన రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ప్రశ్నలు సంధించారు రిపోర్టర్లు. ‘సాధారణ పౌరుల్ని చంపడం ఎప్పుడు ఆపుతారు.. మిమ్మల్ని ట్రంప్ ఎందుకు నమ్మాలి.. ప్రెసిడెంట్ పుతిన్.. ఏ సాధారణ పౌరుణ్ని చంపబోనని మాటిస్తారా..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతా ఒకేసారి అడగడంతో సమావేశపు హాల్ గందరగోళంగా తయారైంది. ఆ ప్రశ్నలు వినపడట్లేదంటూ పుతిన్ సైగలు చేయగా.. కావాలనే అలా చేశారని విమర్శించారు. అయితే జవాబు ఇవ్వనీయకుండా US అధికారులు.. ‘థాంక్యూ ప్రెస్’ అంటూ ముగించారు.