భారత్ గొప్ప దౌత్య(Diplomatic) విజయం సాధించింది. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ దాడి.. TRF(ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థదేనని ఐరాస భద్రతా మండలి(UNSC) తేల్చింది. 26 మంది ప్రాణాలు తీసిన TRF.. లష్కరే తొయిబా అనుబంధ సంస్థేనని తాజా రిపోర్టులో ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని తొలుత రెండు సార్లు TRF ఒప్పుకుందని, దాడి జరిగిన స్థలం ఫొటోలు కూడా ప్రచురించిందని తెలిపింది. లష్కరే తొయిబా మద్దతు లేకుండా ఇది జరిగేది కాదన్న వాదనల్ని UNSC సమర్థించింది. ఆంక్షల కమిటీ నిర్ణయాల్ని భద్రతా మండలి సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించినందున భారత్ కు ఇది పెద్ద దౌత్య విజయమని ప్రపంచ దేశాలు కొనియాడాయి.