అంతరిక్షం(ISS) నుంచి తిరిగివచ్చిన వ్యోమగాముల(Astronauts)కు బంపరాఫర్ ఇచ్చారు అధ్యక్షుడు ట్రంప్. 8 రోజుల కోసం వెళ్లి 9 నెలలు చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కు ఓవర్ టైమ్ జీతం ఇస్తామన్నారు. నాసా వ్యోమగాములు సాధారణ ఉద్యోగుల్లాగే జీతాలు, అలవెన్సు పొందుతారు. అంతరిక్ష యాత్రనూ ఉద్యోగుల టూర్ గానే లెక్కిస్తారు. ISSలో ఉన్నందుకు రోజుకు 5 డాలర్ల(రూ.425) చొప్పున 286 రోజులకు 1,430 డాలర్లు(రూ.1,22,980) అందుతాయి. ఇది కాకుండా జీతం రూ.81.69 లక్షల నుంచి రూ.1.05 కోట్ల మధ్య ఉంటుంది. ‘ఆ ఇద్దరి జీతభత్యాల గురించి ఎవరూ నాతో చెప్పలేదు.. నేను వారి కోసం చేయాల్సి వస్తే నా జేబులోనుంచే చెల్లిస్తా.. మస్క్ మా వద్ద లేకపోతే ఇంకా చాలా కాలం అక్కడే ఉండేవారు..’ అని ట్రంప్ అన్నారు.