
భారత్ పై అమెరికా అధ్యక్షుడి రంగు మరోసారి బయటపడింది. పుతిన్ పర్యటించిన మూడ్రోజులకే బియ్యం పేరిట గొడవ మొదలైంది. భారత బియ్యం దిగుమతులు దెబ్బతీస్తున్నాయంటూ అక్కడి రైతులకు 12 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. డంపింగ్ చేసే భారత్, థాయిలాండ్, చైనా లిస్టును అధికారులు ఇవ్వగానే.. ‘భారత్ గురించి నాకు చెప్పండి.. వాళ్లకు ఎలా అనుమతిచ్చారు.. టారిఫ్ మినహాయింపు ఉందా.. ఆ సంగతి నేను చూసుకుంటా..’ అని ట్రంప్ అన్నారు. చైనా, థాయిలాండ్ గురించి ఆయన పెద్దగా స్పందించకున్నా భారత్ పైనే అక్కసు చూపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సంబంధాలతోనే ట్రంప్ ఇలా వ్యవహరించడం కామన్ అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.