దూకుడు మీదున్న డొనాల్డ్ ట్రంప్(Trump).. ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. దారికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అణు ఒప్పందం(Nuclear Deal)పై సంతకం చేయకపోతే పెద్ద బాంబును తట్టుకోవాలి. ఇంతవరకెన్నడూ అలాంటి బాంబు చూసి ఉండరు అంటూ సీరియస్ అయ్యారు. ఇరాన్ తరచూ అణు పరీక్షలు చేస్తుండటంపై అగ్రరాజ్యం భగ్గుమంది. షరతులకు తలొగ్గేది లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తేల్చిచెప్పారు. దీంతో ఆ దేశ సుప్రీం లీడర్ అయెతుల్లా ఖమైనీకి లెటర్ ను ట్రంప్ పంపించారు. 2015-ఒప్పందం నుంచి 2018లో ఇరాన్ తప్పుకుంది. దీంతో ఆ దేశం కొత్త ఒప్పందానికి అంగీకరించేలా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు.