ప్రపంచ అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా నమోదైన కొద్దిసేపటికే సునామీ వచ్చింది. రష్యా, జపాన్, హవాయి, అలస్కాతోపాటు న్యూజిలాండ్ లో సైరన్లు మోగాయి. జపాన్ ఉత్తరాన హొక్కైడో(Hokkaido) దక్షిణ తీరంలోని టోకాచిలో 40 సెంటీమీటర్ల(1.3 అడుగుల) ఎత్తులో సునామీ కనిపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్ కు 119 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 8.8 తీవ్రత గల భూకంపంతో ఆయా ప్రాంతాల్లో అల్లకల్లోలం సంభవించింది. కరెంటు నిలిచిపోయి, కార్లు కొట్టుకుపోయి, మొబైల్ సేవలు ఆగిపోయి అస్తవ్యస్థ పరిస్థితి ఏర్పడింది.