
మరో తుపాను బీభత్సం సృష్టించింది. ఫిలిప్పీన్స్ ను ఫంగ్-వాంగ్ సూపర్ టైఫూన్ అల్లకల్లోలం చేసింది. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో వచ్చిన పెనుగాలులతో 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సంవత్సరపు అతిపెద్ద తుపాను కావడంతో అక్కడి సర్కారు అత్యవసర పరిస్థితి ప్రకటించింది. తుపాను రేపు తీరాన్ని తాకనుండగా, ఫిలిప్పీన్స్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత తుపానుతోనూ ఫిలిప్పీన్స్ లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.