బ్రిటిష్ వలసరాజ్య దోపిడీకి నిదర్శనంగా నిలిచిన కోహినూర్ వజ్రం(Diamond) త్వరలోనే భారత్ కు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక, మీడియా కార్యదర్శి లిసా నాండీ(Lisa Nandy) ఈ మేరకు హింట్ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రాల్లో ఒకటైన 105.6 క్యారెట్ల భారీ డైమండ్ ను.. తూర్పు ఇండియా కంపెనీ చెరబట్టింది. మహారాజా రంజిత్ సింగ్ ఖజానా నుంచి ఎత్తుకెళ్లిన ఈ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకు సమర్పించారు. దీన్ని తిరిగి ఇవ్వాలంటూ భారత్ ఎన్నోసార్లు కోరగా.. తాజాగా ఆమెతో విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. భారత్-యూకే బంధం బలమైంది, సుదీర్ఘమైందంటూ మాట్లాడిన ఆమె.. కొత్త సాంస్కృతిక ఒప్పందం జరిగే వీలుందన్నారు. పహల్గామ్ దాడిని ఖండించిన లిసా.. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి సహకరిస్తామన్నారు.