రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)ను హత్య చేసేందుకు హెలికాప్టర్ పై ఉక్రెయిన్ దాడికి దిగినట్లు మాస్కో అధికారి తెలిపారు. కర్స్క్(Kursk) రీజియన్లోని ఎపిక్ సెంటర్ వద్ద పుతిన్ పర్యటించే సమయంలో మే 20న డ్రోన్ దాడి జరిగింది. దీన్ని పసిగట్టిన రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. డ్రోన్లను కూల్చివేసింది. మే 20, 22 తేదీల్లో మొత్తం 1,170 డ్రోన్లను కూల్చేసినట్లు కమాండర్ యూరి డాక్షిన్ ప్రకటించారు. మార్చి తర్వాత తొలిసారి అక్కడ పర్యటించారు పుతిన్. ఆయన ఛాపర్ కు దగ్గరగా వచ్చిన 46 డ్రోన్లు నేలమట్టమయ్యాయి. ఈ పరిణామాల దృష్ట్యానే ఉక్రెయిన్ పై వందలాది డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది రష్యా.