ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో పాకిస్థాన్ కు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్(Kashmir) అంశంతో పక్కదారి పట్టించాలని చూడటంపై సభ్య దేశాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. పహల్గామ్ లో ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకోవడంపై మండిపడ్డాయి. అణు దాడి అంటూ ప్రగల్భాలు పలకడంపై సభ్య దేశాలు విరుచుకుపడగా, క్షిపణి పరీక్షల్ని నిలదీశాయి. ఈ చర్చను మళ్లించేందుకు శతథా యత్నించినా.. గంట పాటు భేటీ అయిన దేశాలు శాంతించలేదు. మతం ఆధారంగా టూరిస్టుల్ని చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ దేశానికే చెందిన లష్కరే తొయిబా ప్రమేయంపై గుక్కతిప్పుకోని ప్రశ్నలు సంధించాయి. పహల్గామ్ పై పాకిస్థాన్ వాదనను నిరాకరిస్తూ.. భారత్ తో సమస్యల్ని ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలన్నాయి. కౌన్సిల్లోని 10 శాశ్వత సభ్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి.