రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు ఎంతోమందిని బలిగొన్నాయి. అమెరికా(US)-ఇరాన్(Iran) మధ్య పంతం.. మరో యుద్ధాన్ని తెచ్చేలా ఉంది. అణు ఒప్పంద సంతకం కోసం ట్రంప్.. చేయబోమంటూ టెహ్రాన్ మొండిపట్టుతో ఉన్నాయి. వినకపోతే బాంబ్ వేస్తామన్నా ఖాతరు చేయని ఇరాన్.. అగ్రరాజ్య దాడిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే భూగర్భంలో దాచుకున్న మిసైల్స్ ని వైమానిక దాడుల కోసం రెడీ చేసుకుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య మరో యుద్ధం రాబోతుందా అన్న చర్చ జరుగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇప్పటికే గాజాతోపాటు ఇరాన్ పైనా ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇక అమెరికా కూడా తోడవుతుండటంతో ఇది ఎక్కడకు వెళ్తుందోనన్న భయాలు వెంటాడుతున్నాయి.