అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. 24 రాష్ట్రాల్లో ఆయన విజయం సాధిస్తే, ప్రత్యర్థి కమలా హారిస్ 13 రాష్ట్రాలు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుండగా.. 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో(Results) ట్రంప్ 230, కమల 205 ఓట్లు దక్కించుకున్నారు. ఏడు స్వింగ్ రాష్ట్రాలకు గాను ఆరింట్లో(జార్జియా, వియ్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగన్, పెన్సిల్వేనియా, అరిజోనా) ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. పాపులర్ ఓట్లలో ట్రంప్ కు 52.4 శాతం, హారిస్ కు 46.3 శాతం ఓట్లు పోలయ్యాయి.
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు….: ఫ్లోరిడా, ఇండియానా, టెక్సాస్, మిసోరి, లూసియానా, అలబామా, ఆర్కాన్సాస్, కెంటకీ, సౌత్ డకోటా, మిసిసిపి, నెబ్రాస్కా, నార్త్ డకోటా, టెన్నెసీ, ఒహాయో, ఓక్లహామా, యుటా, మోంటానా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, వయోమింగ్, కేన్సస్, అయోవా, నార్త్ కరోలినా
కమలాహారిస్ గెలిచిన రాష్ట్రాలు….: న్యూయార్క్, వెర్మాంట్, కొలరాడో, మసాచుసెట్స్, మేరీల్యాండ్, రోడ్ ఐలాండ్, డెలవేర్, ఇల్లినాయిస్, కనెక్టికట్