
వీసా ఇచ్చాక కూడా అబ్జర్వేషన్ ఉంటుందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం(Embassy) స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇప్పటిదాకా చేసిన పోస్టుల్ని వీసాదారులు తెలపాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో ఉపయోగించిన ప్లాట్ ఫామ్స్, అన్ని సోషల్ మీడియా యూజర్ నేమ్స్ లేదా హ్యాండిల్స్ ను అప్లికేషన్ లో తెలపాలి. అందులోని సమాచారం నిజమని తేల్చిన తర్వాతే భారతీయులకు వీసా మంజూరవుతుందని ఎంబసీ చెప్పింది. అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్ నియమాలు పాటించని వ్యక్తుల వీసాలు ఎప్పుడైనా రద్దయ్యే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చింది. ఈ లెక్కన సోషల్ మీడియా అకౌంట్లు ఇవ్వకపోతే అమెరికా వీసా దొరకదని తేలింది.