అమెరికా అధ్యక్ష(President) చరిత్రలో తొలిసారి మహిళ పోటీ చేయబోతున్నారు. కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్(Democratic) పార్టీ నేషనల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. జో బైడెన్ అభ్యర్థిత్వాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఇక కమలా హారిసే తదుపరి అభ్యర్థి అని ముందునుంచే భారీస్థాయిలో ప్రచారం జరిగింది.
మొదటి ఆఫ్రికన్-అమెరికన్, దక్షిణాసియా-అమెరికన్ గా అధ్యక్ష బరిలో నిలిచే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించబోతున్నారు. జోబైడెన్ నాయకత్వంలో వైస్ ప్రెసిడెంట్ గా, కాలిఫోర్నియా సెనెటర్(Senator)గా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. బైడెన్ వైదొలిగిన తర్వాత 32 గంటల్లోనే ఆమెకు 1,976 మంది డెలిగేట్ల మద్దతు లభించింది.