అంతుచిక్కని పేలుళ్లతో లెబనాన్(Lebanon) రక్తసిక్తంగా మారింది. నిన్నటిదాకా పేజర్ల(Pagers)తో పేలుళ్లు జరిగితే నేడు వాకీటాకీలు పేలి 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది దాకా గాయాలపాలైనట్లు హెజ్బొల్లా తెలిపింది. తూర్పు లెబనాన్ ప్రాంతంలో వాకీటాకీలతోపాటు ల్యాండ్ లైన్లు పేలిపోయాయి. హెజ్బొల్లా ప్రతినిధి నిన్న పేజర్ల పేలుళ్లలో మృతిచెందితే అతడి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే వాకీటాకీ పేలింది.
నిన్న పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా, 3 వేల మంది గాయపడ్డారు. ఈ పేజర్లు, వాకీటాకీలు, ల్యాండ్ లైన్లు 5 నెలల క్రితం కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశాల్లో అధునాతన చరిత్ర కలిగిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్.. హిజ్బొల్లా దిగుమతి చేసుకున్న పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చిందని లెబనీస్ ప్రభుత్వం తెలిపింది.