ఇరుదేశాల వైమానిక దాడులు… 12 మంది మృతి… 86 గ్రామాల్లోని 40 వేల మంది తరలింపు… శివాలయం కోసం కంబోడియా, థాయిలాండ్ చేస్తున్న యుద్ధంలోని ఘట్టాలివి. వెయ్యేళ్ల నాడు అంకితమిచ్చిన హిందూ మందిరమైన శివాలయం.. కంబోడియా డాంగ్రెక్(Dangrek) పర్వతాల్లోని 525 మీటర్ల కొండపై ఉంది. సహజంగా ఏర్పడిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇది ఆ దేశస్థులకే కాకుండా థాయ్ వాసులకూ మతపర ప్రదేశం. అంగ్ కోర్ వాట్ ఆలయ ప్రజాదరణతో ఈ శివాలయాల గురించి పెద్దగా ప్రచారం లేదు. కానీ ఇవి 500 ఏళ్లుగా వివాదంలో ఉన్నాయి. https://justpostnews.com
మిలిటరీ F-16 విమానాలతో థాయ్, ఆయుధాలతో కంబోడియా దాడులకు దిగాయి. ఈ గుడి కంబోడియాదేనని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ) తీర్పిచ్చింది. ఆలయం సహా సమీప ప్రాంతంపైనా కంబోడియా సార్వభౌమత్వాన్ని… 2011లో ఘర్షణల తర్వాత 2013లో కట్టబెట్టింది. తొలుత థాయ్ ఒప్పుకున్నా.. 2008లో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు రావడాన్ని తట్టుకోలేకపోయింది. అప్పట్నుంచి మాటామాట పెరిగి యుద్ధానికి దారితీసింది.