
యుద్ధ తీవ్రతతో నేపాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండ్రోజులు సెలవులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అక్కడ 18 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శని, ఆదివారాలు సెలవు రోజులుగా ఇచ్చిన ఆదేశాలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోలియం ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫీసులు సైతం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేయాలి. నేపాల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రధానిగా బాలెన్ షా ఈ మధ్యే గద్దెనెక్కారు. ఆయన వచ్చీరాగానే ఇరాన్ యుద్ధం ముదిరిపాకాన పడటంతో ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం పడింది.