ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ స్థానమేంటో మోదీ గుర్తు చేశారు. ఈసారి ఆ దేశ నేతలకు కాకుండా అక్కడి ప్రజలకు ప్రశ్నలు వేశారు. ఏమన్నారంటే… ‘నేను పాక్ ప్రజల్ని అడుగుతున్నా.. ఉగ్రవాదంతో మీరేం సాధించారు.. ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.. మరి మీరు ఎక్కడున్నారు.. పాక్ మొత్తం టెర్రరిజం వ్యాధితో బాధపడుతోంది.. ప్రజలారా దాన్నుంచి బయటపడండి.. యువత ముందుకు రావాలి.. ప్రశాంత జీవితం గడపండి.. మీ భోజనం మీరు తినండి.. మా బుల్లెట్లు కాదు..’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.