ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలపై సుంకాలు(Tariffs) విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ఇందులో రష్యా పేరు మాత్రం కనపడలేదు. అమెరికాపై ఇతర దేశాలు విధించిన సుంకాలు, US ప్రకటించిన సుంకాల్ని ట్రంప్ సర్కారు వివరించింది. ఆ పెద్ద లిస్టులో రష్యా లేకపోవడంతో అక్కడి ప్రెస్ కార్యదర్శిని విలేకరులు ప్రశ్నించారు. రష్యా మినహాయింపునకు అసలు కారణం.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలేనట. వాణిజ్యాన్ని నిరోధించే ఆంక్షలు అమలవడంతో రష్యాను పక్కనపెట్టారు. అయినప్పప్పటికీ మారిషస్(Mauritus), బ్రూనై దేశాల కన్నా రష్యాతో నెరపుతున్న వాణిజ్యమే ఎక్కువ. ఇక క్యూబా, బెలారస్, ఉత్తర కొరియా పేర్లు సైతం జాబితాలో కనపడలేదు. ఇప్పటికే ఆ దేశాలపై భారీ స్థాయిలో టారిఫ్ లు ఉన్నాయని అమెరికా తెలిపింది.