మరిన్ని కారణాలివే…
2022లో నాగోర్నో-కరాబాఖ్ యుద్ధంలో అజర్ బైజాన్ కు తుర్కియే, పాక్ మద్దతిచ్చాయి. అప్పుడు ఒంటరిగా మిగిలిన అర్మేనియా.. ఆకాశ్ క్షిపణి కోసం భారత్ సాయం కోరింది. ఆర్మేనియానే కాదు తుర్కియే ప్రత్యర్థులైన ఇరాన్, గ్రీస్, సైప్రస్, ఇండొనేషియా, UAE, ఇజ్రాయెల్.. ఇలా దేశాలన్నీ భారత్ సంబంధాల్ని కోరుకున్నాయి. తన సమీపంలో పెరుగుతున్న భారత ప్రభావం ఎర్గోగాన్ కు నిద్రపట్టనీయలేదు. భారత్ కు వ్యతిరేకంగా పలు దేశాల్ని ఆకర్షించాలని చూసినా, అవి ఢిల్లీ ప్రయోజనాల్ని వ్యతిరేకించలేదు. అంతలా మారిపోయింది భారతదేశ విదేశాంగ విధానం. మోదీ సర్కారు మెజార్టీ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకుంది. ఇక తుర్కియేకు మిగిలింది చైనా, పాక్ మాత్రమే. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కోసం ఎర్గోగాన్ ను మచ్చిక చేసుకుంది చైనా. ఇది తప్పితే ముస్లిం దేశాల్లో అది ఒంటరి అయింది.