పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలు ఆపేయడంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని భావించిన పాకిస్థాన్ కు షాక్ తగిలింది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేమంటూ ప్రపంచ బ్యాంక్(World Bank) అధ్యక్షుడు అజయ్ బంగా స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ అనేది కేవలం సహాయకారి(Helper) మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. సింధు జలాల నిలిపివేతపై జోక్యం చేసుకున్నామంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు. సింధునదిపై గల ప్రాజెక్టుల నుంచి నీటిని నిలిపేయడంతో శత్రు దేశం ఎడారిగా మారిపోయింది.