అదో దట్టమైన, భీకర అడవి. ప్రపంచంలోనే అతిపెద్ద అటవీప్రాంతం. క్రూరమృగాలు సంచరించే చోట 40 రోజుల తర్వాత చిన్నారుల ఆచూకీ లభించింది. అమెజాన్ అడవుల్లో నలుగురు చిన్నారులు సురక్షితంగా ఉన్నారంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో చేసిన ప్రకటనతో ఆ దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలు కనిపించాయి. అమెజాన్ అడవుల్లో గత మే 1న ఓ విమానం కుప్పకూలింది. అంతకుముందు ఈ లోహవిహంగం… అమెరికా రాజధాని వాషింగ్టన్ గగనతలంలో సంచరించింది. కానీ అక్కడి సైన్యానికి చిక్కకుండానే మాయమైంది. ఇంజిన్లో సాంకేతిక సమస్యతో ఆ విమానం రాడార్ల నుంచి మాయమైంది. అది కూలి పైలట్, గైడ్ తోపాటు మహిళ మృత్యువాత పడ్డారు. అందులో ఉన్న నలుగురు చిన్నారులు కనిపించకుండా పోయారు. పండ్లు, ఆకులు ఇలా దొరికిందల్లా తినుకుంటూ కాలం గడిపారు. విషయం తెలుసుకున్న కొలంబియా సర్కారు.. ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. 100 మంది సైనికులతో మూడు హెలికాప్టర్లు అడవుల్లో శోధించాయి. 3 మృతదేహాలు గుర్తించిన బలగాలు చిన్నారుల కోసం వేటను కొనసాగించాయి. పిల్లలపై ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో పసివాళ్లు తారసపడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దేశ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని అధ్యక్షుడు ప్రకటించారు. ఏడాది చిన్నారితోపాటు 9, 11, 13 ఏళ్ల వయసున్న పిల్లలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.