
చెన్నై సూపర్ కింగ్స్(CSK) వరుసగా మూడోసారి ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విసిరిన 251 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు గాను 207కే ఆలౌటైంది. సర్ఫరాజ్(50), ప్రశాంత్ వీర్(43), ఓవర్టన్(37) నిలబడే ప్రయత్నం చేసినా చెన్నైకి భారీ పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ 3, డఫీ, అభినందన్, కృణాల్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఆడిన రెండింటినీ ఆర్సీబీ గెలుచుకోగా, సీఎస్కే మాత్రం పాయింట్ల టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. టిమ్ డేవిడ్(70 నాటౌట్), దేవదత్ పడిక్కల్(50), రజత్ పటీదార్(48 నాటౌట్) విరుచుకుపడి ఆడటంతో అంతకుముందు CSK 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. భారీ విజయం దక్కడంతో అద్భుత రన్ రేట్ తో పాయింట్ల టేబుల్ లో బెంగళూరు టాప్ ప్లేస్ కు చేరుకుంది.