
పాఠశాలల్లో ఫోన్లు నిషేధించాక కొద్దికాలంలోనే విపరీతమైన మార్పులు కనిపించాయని హంగెరీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ముఖాముఖి సంభాషణలు పెరగడం, బయట ఆడుకోవటం, చదరంగంపై ఆసక్తి పెరిగిందట. తరగతి గదిలో పుస్తకాలు చదవడం, చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయడం, క్లాస్ రూం బయట ఆటల ధ్యాసతోనే ఉన్నారని గుర్తించారు. ఆంక్షలకు ముందు 37% మంది ఫోన్ రెగ్యులర్ గా చూస్తే నిషేధం తర్వాత 4 శాతానికి తగ్గింది. ఆంక్షలకు ముందు అన్యమనస్కంగా ఉన్న పిల్లల్లో.. ఫోన్లు నిషేధించాక చదువు, జ్ఞాపకశక్తి పెరిగిందని తేలింది. నిషేధాలు పరధ్యానాన్ని తగ్గించి కలుపుగోలుతనాన్ని పెంచాయి. ఫోన్ నోటిఫికేషన్ చూడటం కూడా ఏకాగ్రతకు భంగమేనని ఎనికో పొజ్ సోన్యీ, తుండే లెంగిలీన్ మోల్నర్, రేకా రాక్ స్కో బృందం తెలిపింది.