ఆధార్ ను దేశవ్యాప్తంగా అత్యంత కీలక గుర్తింపు కార్డుగా భావిస్తున్నాం. కానీ అలాంటి కార్డులో మార్పులు, చేర్పులక సంబంధించి కేంద్రం ఇచ్చిన గడువు ముగిసిపోతున్నది. ఆలోపు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుంటే మాత్రం ఇక భవిష్యత్తులో డబ్బులు చెల్లించి మరీ అప్డేట్(Update) చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చివరి తేదీ అయిన ఈ నెల(మార్చి) 15 కల్లా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. UIDAI(Unique Identification Authority Of India) నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఫ్రీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి.
పదమూడున్నరేళ్లుగా…
భారత్‌లో సెప్టెంబరు 29, 2010న ఆధార్ ప్రారంభమైంది. అంటే పదమూడున్నరేళ్లుగా ఏళ్ల నుంచి గుర్తింపునకు రుజువుగా ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డ్ తో బయోమెట్రిక్ డేటా, ఫొటోగ్రాఫ్‌లు, అడ్రస్, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు సహా వివిధ సేవలను యాక్సెస్ చేయడానికి ఈ వివరాలను ఉపయోగించవచ్చు. అయితే డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, మీ ఆధార్ ఫొటోను ఏళ్ల తరబడి మార్చకుంటే.. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మార్చకపోతే అప్డేట్(Update) చేయడానికి ఇదే మంచి సమయం. యూఐడీఏఐ(UIDAI) ప్రకారం.. 15 ఏళ్లు దాటిన వ్యక్తులు తమ ఫొటోతో సహా ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి.
ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయాలంటే? :
ఆధార్ ఫొటోలో మార్పు కోసం దరఖాస్తు చేయడానికి ముందు UIDAI ఆధార్ హోల్డర్లు.. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, వేలిముద్రలు(Finger Prints), ఐరిస్, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి, బయోమెట్రిక్ ధృవీకరణ కోసం సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇందుకు కనీస సర్వీసు ఛార్జీని చెల్లించాలి.
ఈ కింది విధంగా ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు :
అధికారిక UIDAI వెబ్సైట్ (uidai.gov.in)ను సందర్శించండి
వెబ్సైట్ నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి (ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో పొందవచ్చు)
రిజిస్టర్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను నింపండి.
మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేసి సమర్పించండి.
సమీప కేంద్రాన్ని గుర్తించడానికి points.uidai.gov.in/ లింక్‌ని నొక్కండి.
ఆధార్ ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అన్ని వివరాలను నిర్ధారిస్తారు.
ఎగ్జిక్యూటివ్.. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌లో అప్డేట్ చేయాల్సిన కొత్త ఫొటోను అడుగుతారు
ఈ సర్వీసు కోసం రూ.100 రుసుము జీఎస్టీతో వసూలు చేస్తారు. మీకు రసీదు స్లిప్ అందిస్తారు.
యూఐడీఏఐ వెబ్సైట్లో అప్డేట్ల స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉపయోగించవచ్చు.
గరిష్టంగా 90 రోజులు :
ముఖ్యంగా, ఆధార్ కార్డ్‌లోని సమాచారాన్ని అప్డేట్ చేయడానికి గరిష్టంగా 90 రోజులు పట్టవచ్చు. మీరు స్టేటస్ చెక్ చేయడానికి URN నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ పొందాలంటే.. మీ ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసిన తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో కాపీని ప్రింట్ తీసుకోవచ్చు. UIDAI అధికారిక వెబ్సైట్ నుంచి ఇ-ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.