ఇప్పటివరకు వాట్సాప్ ద్వారా మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు, వాయిస్/వీడియో కాల్స్ మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉంది. అటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు చేయడం చూస్తూనే ఉన్నాం. ‘మెటా’ ఆధ్వర్యంలోని ఈ రెండు సోషల్ మీడియా(Social Media) దిగ్గజాలు.. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా అధునాతన(Modern) ఫీచర్ల(Features)తో యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త విధానాన్ని ఈ రెండింట్లోనూ ప్రవేశపెట్టబోతున్నది ‘మెటా’ యాజమాన్యం.
ఏమిటీ చాట్ బాట్…
మనం ప్రస్తుతం గూగుల్ లో సమాచారం(Information)తోపాటు ఫొటోలు/వీడియోలు ఎలా పొందుతున్నాం. గూగుల్(Google) సెర్చింజన్ లో వెతకడం ద్వారా వాటిని తీసుకోగలగుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ఫీచర్ నే అమలు చేయబోతున్నాయి వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్. ఈ కొత్త ఫీచర్ తో మీకు ఇష్టమైన విధంగా AI ఇమేజ్ లతోపాటు ఇన్ఫర్మేషన్ మొదలుకొని కావాల్సిన అన్ని రకాల వివరాల్ని వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ల్లోనే పొందవచ్చు.
త్వరలోనే అందుబాటులోకి…
భారత యూజర్ల కోసం ‘మెటా’ ఇప్పటికే వాట్సాప్ లో చాట్ బాట్ అందుబాటు(Availability)లోకి తెచ్చింది. ఇది ప్రస్తుతానికి కొందరికే పరిమితమైనా క్రమంగా అందరికీ చేరుతుందని వాట్సాప్ ప్రకటించింది. మీ ఫోన్ లో ఈ యాప్ కనపడకపోతే ఒకసారి అప్డేట్(Update) చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చెయ్యగానే కింద ఎడమ వైపు(Left Side) మూలన పాప్ ఐకాన్ రూపంలో కనిపిస్తుంది. దాంట్లో మీకు నచ్చిన ప్రాంప్ట్(Prompt)ను అందిస్తే అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. అదే విధంగా ఇన్ స్టాగ్రామ్ లోనూ AI చాట్ బాట్ రెడీ అయింది. అయితే ఇందుకు కొద్దిగా సమయం పట్టనుంది. ‘ఇన్ స్టాగ్రామ్’ సెర్చ్ బార్(Search Bar)లో ఈ ఫీచర్ పొందుపరిచింది. సెర్చ్ బార్ ను యాక్సెస్ చేయడం ద్వారా AI సర్వీసుల్ని అందుకోవచ్చు.
స్టెప్స్ ఇలా…
యాప్ ను అప్డేట్ చేసుకుని ఓపెన్ చేయాలి..
స్క్రీన్ అడుగున గల సెర్చ్ బటన్ ను యూజ్ చేయాలి..
మీ యాక్సెస్ పూర్తవగానే సెర్చ్ బార్ లో బ్లూ రింగ్ కనిపిస్తుంది..
అప్పుడు మిమ్మల్ని ఏం కావాలని అడుగుతుంది.
మీరు టెక్ట్స్ మెసేజ్ లేదా క్వశ్చన్ అడగవచ్చు…
అయితే క్వశ్చన్ అడగాలంటే మైక్రో ఫోన్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మీకు ఇలా…
హాయ్(Hi)..
మై నేమ్ ఈజ్ మెటా(My Name Is Meta)..
మీరు నేర్చుకోవడానికి సహాయకుడిగా నన్ను భావించండి(Think of me like an assistant who’s here to help you learn, plan and connect)..
ఈరోజు మీకు ఎలా సహాయం చేయగలను(What can I help you with today)
అప్పుడు మీరు అడిగిన దానికి రెస్పాన్స్ వస్తుంటుంది(You can ask the Meta AI to suggest some funny Reels, and it will give you some options)