టెక్నాలజీ పరంగా నిత్యం కొత్త కొత్త సిస్టమ్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగిత(Unemployment) పెరిగిపోతుంటే, మరోవైపు నైపుణ్యం(Experts) గల ఉద్యోగులు లేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఏటా లక్షల సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులు వస్తున్నా సరైన ప్లేస్మెంట్స్ లేక అవస్థలు పడుతున్నారు. అటు సాఫ్ట్ వేర్ రంగంలోనూ గత మూడేళ్లుగా నియామకాలే లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ అయిన TCS(Tata Consultancy Services) ప్రెసిడెంట్ వి.రాజన్న కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్ HICCలో జరిగిన హైసియా(Hyderabad Software Enterprises Association) నిర్వహించిన నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు.
ఆయన మాటల్లోనే…
‘రానున్న రోజుల్లో టెక్నాలజీ రంగంలో భారీగా ఉద్యోగుల అవసరం ఉంటుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో 10 లక్షల మంది అవసరమవుతారు. ప్రపంచవ్యాప్తంగా(Worldwide)గా A.I. ఆర్థిక వ్యవస్థ వాటా ఏటా 40% వృద్ధి చెందుతున్నది.. ఇంటర్నేషనల్ లెవెల్లో AI వృద్ధిలో భారత్ వాటా కీలకమవుతుంది.. అందరికీ AI పేరుతో నీతిఆయోగ్ సైతం ప్రత్యేక స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. 2026 నాటికి భారతదేశంలో 10 లక్షల మంది ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే అవసరమవుతారు.. ఈ టెక్నాలజీని వాడుకోవడంతో సంస్థలతోపాటు ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి.. తాజా మేడారం జాతరలో AI సహా డ్రోన్లను వాడటమే ఇందుకు నిదర్శనం.. పంటల దిగుబడి, తయారీ రంగంలోనూ విశేష మార్పులకు ఈ టెక్నాలజీ అవసరం’.. అని రాజన్న గుర్తు చేశారు.
మహీంద్రా మాజీ CEO సైతం…
స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు ఎప్పుడూ తిరుగుండదని, కొత్త కొత్త ఆలోచనలపై యువ ఇంజినీర్లు దృష్టిపెట్టి అప్డేట్ అవుతుంటే AI రంగంలో జాబ్ లు పెరుగుతాయే తప్ప తగ్గవని టెక్ మహీంద్రా మాజీ CEO సి.పి.గుర్నాని గతంలోనే అన్నారు. హార్డ్ వర్క్ చేయాలన్న ఇన్ఫోసిస్ అధినేత ఎన్.ఆర్.నారాయణమూర్తి మాటలతో ఏకీభవిస్తున్నానని గుర్నాని స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విస్తరిస్తూనే ఉంటుంది.. తద్వారా మరిన్ని జాబ్ లు క్రియేటవుతాయి.. AI ఛాట్GPTతో జాబ్ లు పోతాయని అనుకుంటున్నారో అవన్నీ అర్థరహితం.. మానవుల మాదిరిగా AI పనిచేస్తుందనుకుంటే పొరపాటే.. మారుతున్న కాలం, విధానాలకు అనుగుణంగా ఎవరైతే స్కిల్స్ పై ఎక్కువ దృష్టిపెడతారో అలాంటి వారికి తిరుగుండదు’ అంటూ గత డిసెంబరు 18న అన్నారు. అదే నెల 19న ఆయన CEOగా రిటైరయ్యారు. హైసియా సదస్సులో పాల్గొన్న గుర్నాని.. AIని ఆపరేటింగ్ సిస్టమ్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.