
ఢిల్లీ బాంబు పేలుడుకు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రకు కారణమైన అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఓ మాయాలోకంగా మారింది. దాని వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్ధిఖీపై క్రిమినల్ కేసు ఉంది. రూ.7.5 కోట్ల మోసం కేసులో మూడేళ్లు జైల్లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఆయన అల్-ఫలాహ్ వర్సిటీ ట్రస్ట్ పై 9 కంపెనీలు నడుపుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఒకే అడ్రస్ కింద ఫైనాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్ వేర్, విద్య, విద్యుత్తు సెక్టార్లు నడుపుతున్నాడు. కారులో బాంబులు తీసుకెళ్తూ పేలి చనిపోయిన ప్రొఫెసర్ ఉమర్, అరెస్టయిన డా.ముజమ్మిల్, మహిళా డాక్టర్ షహీన్ షహీద్ అదే యూనివర్సిటీలో పనిచేస్తూ ఉగ్రవాదం కోసం బాంబులు తయారు చేశారు.