
Published 29 Jan 2024
ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video).. యూజర్లకు షాకిచ్చింది. ఈ రోజు(జనవరి 29, 2024) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ కనిపిస్తాయి. ప్రైమ్ యూజర్లు ఏదైనా వీడియో చూస్తున్న సమయంలో మధ్యలో యాడ్స్(Advertisements) వస్తుంటాయి. సబ్స్క్రైబర్లు యాడ్-ఫ్రీ వీడియో కంటెంట్‌ని ఆస్వాదించాలనుకుంటే మాత్రం అదనపు రుసుము చెల్లించాలి. ప్రైమ్ వీడియో కోసం కంటెంట్(Content)ను రూపొందించడంలో కంపెనీ మరింత పెట్టుబడి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో కొత్త ప్లాన్‌పై నో క్లారిటీ
ఇప్పటికే ఉన్న ప్రైమ్ మెంబర్స్ కోసం సబ్స్క్రిప్షన్(Subscription) ధర 2024లో మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లు యాడ్-ఫ్రీ మూవీస్ లేదా షోలను యాక్సెస్ చేయాలనుకుంటే అమెరికా ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ నెలకు 2.99 డాలర్ల అదనపు ధరతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. అయితే, ఇతర దేశాల ధరలు తరువాత తేదీలో వెల్లడి కానున్నాయి. ఈ మార్పు ప్రారంభంలో UK, USA, జర్మనీ, కెనడాల్లో అమల్లోకి వస్తుంది. సంవత్సరం తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు విస్తరించనున్నారు. అయితే ఈ మార్పులు భారత OTT మార్కెట్లో ఎప్పుడు అమలులోకి వస్తాయనే దానిపై అధికారిక ప్రకటన లేదు.
యాడ్ ఫ్రీ సపోర్టు అందించే ఇతర ప్లాట్ఫారాలివే
అందరికి తెలిసినట్లుగా ఇప్పటికే సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలలో భాగంగా మ్యూజిక్ స్ట్రీమింగ్(Music Straming), ఫాస్ట్ షిప్పింగ్, ఎక్స్‌క్లూజివ్ డీల్‌లు మరిన్నింటితో సహా కంటెంట్‌కు యాడ్ ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇంకా Netflix, Disney+, Hulu వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌లు సభ్యత్వ ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఇప్పటికే ఇలాంటి యాడ్ ఫ్రీ సపోర్టు గల ఆప్షన్లను ప్రవేశపెట్టాయి. గత 2023 సెప్టెంబర్‌లో ఓటీటీ కంటెంట్ కోసం 2024 ప్రారంభంలో పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఎక్కువ కాలం పాటు పెట్టుబడి(Investment)ని పెంచడానికి ప్రైమ్ వీడియో షోలు, మూవీలు, పరిమిత యాడ్స్ కలిగి ఉంటాయి.