Published 24 Jan 2024
Apple Stolen Device Protection Feature: ఆపిల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్, ఐప్యాడ్ (iOS 17.3, iPadOS 17.3) కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ రిలీజ్ చేసింది. సపోర్టు ఉన్న అన్ని ‘ఆపిల్’ డివైజ్‌లకు అనేక అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. కొంతమంది పోటీదారుల మాదిరిగా కాకుండా ‘ఆపిల్’ ఈ కొత్త సెక్యూరిటీ అప్డేట్లను యూజర్లందరికి అందుబాటులో ఉండేలా చేసింది. ‘ఆపిల్’ (iOS 17.3) అప్డేట్లోని ప్రత్యేక ఫీచర్లలో వినూత్నమైన స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్ ఒకటి. ఈ కొత్త సెక్యూరిటీ లేయర్.. మీ డివైజ్ దొంగిలించిన సందర్భాల్లో యూజర్ డేటాను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అలాంటి సంఘటనల బారిన పడిన వారికి అదనపు స్థాయి రక్షణను అందిస్తుంది.
ఈ సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
‘స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్’ కింద సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేయడానికి ఇప్పుడు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ తప్పనిసరి. అంతేకాకుండా, ఆపిల్ ఐడీ పాస్వర్డ్ లేదా డివైజ్ పాస్‌కోడ్ వంటి క్లిష్టమైన సెట్టింగ్‌లను మార్చడం ద్వారా మరింత భద్రతను అందిస్తుంది. ఐఫోన్ తెలిసిన లొకేషన్లలో తప్ప, వినియోగదారులు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని ఉపయోగించాలి. ఒక గంట వెయిటింగ్ పీరియడ్ అనంతరం అదనపు బయోమెట్రిక్ అథెంటికేషన్ పొందాలి. ఈ మల్టీ-ఫేస్ ప్రాసెస్ అనధికారిక యాక్సెస్ నుంచి మీ డివైజ్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది.
ఎయిర్‌ప్లే ఫంక్షనాలిటీతో హోటల్ సపోర్టు :
ఆపిల్ ఔత్సాహికులు తమ డివైజ్ ఇంటర్‌ఫేస్‌లకు కొత్త వాల్‌పేపర్ వంటి లేటెస్ట్ ఫీచర్లను అందుకుంటున్నారు. అదనంగా, ఆపిల్ మ్యూజిక్ వినియోగదారులు ఇప్పుడు స్నేహితులతో ప్లే-లిస్టులను పంచుకోవచ్చు. మ్యూజిక్-పార్ట్నర్ ఎక్స్పీరియన్స్, ఎమోజి రియాక్షన్లను యాడ్ చేయడం ద్వారా ట్రాక్‌లకు రిప్లయ్ ఇచ్చేందుకు యూజర్లను అనుమతిస్తోంది. ఎయిర్‌ప్లే ఫంక్షనాలిటీతో హోటల్ సపోర్టును అందిస్తోంది. వినియోగదారులు ఎంచుకున్న స్థానాల్లోని హోటల్ గదులలోని టీవీకి నేరుగా కంటెంట్‌ను యాక్సస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ మొత్తం యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి ఈ సెక్యూరిటీ ఫీచర్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆపిల్ బాటలో ఇతర టెక్ దిగ్గజాలు :
క్రాష్ డిటెక్షన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఆపిల్ డివైజ్‌ల్లో సున్నితమైన మరింత విశ్వసనీయమైన పనితీరును నిర్ధారిస్తుంది. ఈ సమగ్రమైన అప్డేట్లు భద్రతా చర్యలను పెంచడమే కాకుండా యూజర్ ఎంగేజ్మెంట్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆపిల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను మరింతగా మెరుగుపరుస్తున్న తరుణంలో ఇతర టెక్ దిగ్గజాలు, ముఖ్యంగా గూగుల్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల తయారీదారులు ఇదే బాటలో వెళ్లేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో తమ సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు ఇలాంటి ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తారని వినియోగదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.