300 కిలోమీటర్ల వేగం.. కిలో పేలోడ్ తో బాంబులు వేసే సత్తా… కళ్లు మూసి తెరిచేలోపే మాయమై రాడార్లకూ దొరకదు… ఇద్దరు విద్యార్థులు తయారు చేసిన ఈ ‘కామికేజ్’ డ్రోన్లను ఏకంగా సైన్యమే కొనుగోలు చేసింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ కు చెందిన 20 ఏళ్ల మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్.. వీటిని తయారు చేశారు. రాజస్థాన్ అజ్మీర్ కు చెందిన జయంత్ ఖత్రి, కోల్ కతా వాసి సౌర్య చౌదరి.. భారత్ కు అనుగుణంగా హాస్టల్ గదిలో కేవలం 2 నెలల్లోనే రూపొందించారు. ఇంకేముంది.. ఈ విషయాన్ని కోల్డ్ మెసేజ్ ల ద్వారా ఆర్మీ అధికారులకు చేరవేశారు. https://justpostnews.com
ఒక కర్నల్(Colonel) డెమో కోసం వారిని ఛండీగఢ్ పిలిపించారు. మార్కెట్లో ఉన్న వాణిజ్య UAVల కన్నా 5 రెట్ల వేగంతో ‘కామికేజ్’లు ఆ డెమోలో దూసుకుపోయాయి. హరియాణా చండిమందిర్, బెంగాల్ పనాగఢ్, అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ యూనిట్లకు వీటిని అమ్మడం ద్వారా ఈ విద్యార్థులు దేశ రక్షణ రంగాన్నే ఆశ్చర్యపరిచారు.