Ather 450 electric scooter : జైపూర్‌కు చెందిన ఒక కస్టమర్ రూ.10 నాణేలతో లక్షల విలువైన కొత్త ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఈ ప్రత్యేకమైన చెల్లింపు పద్ధతి ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించి ఫొటోను ట్విట్టర్ (X) వేదికగా ఆయన షేర్ చేశారు. కస్టమర్‌కు స్కూటర్ కీని అందజేయడం చాలా గర్వంగా ఉందన్నారు. అన్ని రూ. 10 నాణేలతో నిండిన పర్సులు టేబుల్‌పై ఉంచినట్టు తెలిపారు.
రూ.10 నాణేలతో కొనుగోలు :
జైపూర్‌లో ఒక కొత్త కస్టమర్ ఇప్పుడే ఏథర్ స్కూటర్ 450 కొనుగోలు చేశాడు. అతడు స్కూటర్ కొనుగోలు కోసం అన్నీ రూ.10 నాణేలనే తీసుకొచ్చాడని సీఈఓ మెహతా చెప్పారు. ఇంతకీ ఆ కస్టమర్ కొనుగోలు చేసిన Ather 450 సిరీస్ కచ్చితమైన వేరియంట్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. బెంగళూరు ఈవీ స్టార్టప్ ఏథర్ ప్రస్తుతం ఈ సిరీస్‌లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను అందిస్తోంది. అందులో ఏథర్ 450S, 450X, 450 Apex అనే వేరియంట్లు ఉన్నాయి.
ఏథర్ అపెక్స్ స్కూటర్ ధర ఎంతంటే? :
ఈ ఫ్లాగ్షిప్ 450 అపెక్స్ స్కూటర్ మోడల్ ధరలు 450S మోడల్‌కు రూ.1.10 లక్షల నుంచి రూ.1.89 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లతో పాటు, కంపెనీ ఇప్పుడు మొదటి ఫ్యామిలీ-ఓరియెంటెడ్ స్కూటర్ రిజ్టాను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాబోయే ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ కు సంబంధించిన ఫొటోను స్టాండ్-అప్ కమెడియన్ అనుభవ్ సింగ్ బస్సీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. కంపెనీ కూడా అనేక టీజర్లను రిలీజ్ చేసింది.
అతిపెద్ద సీటుతో ఫ్యామిలీ రిజ్టా మోడల్ :
ఏథర్ 450 సిరీస్ పనితీరులో అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో ఈ ఏథర్ స్కూటర్ ఆధారిత డిజైన్ బాగా పాపులర్ అయింది. రాబోయే కొత్త ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా కూడా భిన్నమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ రాబోయే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ స్కూటర్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రిజ్టా మోడల్ సెగ్మెంట్లో అతిపెద్ద సీటును కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఇప్పటికే రిజ్టా అతిపెద్ద ఏథర్ స్కూటర్‌గా నిలిచింది. ఈ కొత్త ఇ-స్కూటర్ ఇతర ఏథర్ మోడల్‌లతో పోలిస్తే.. మెరుగైన రేంజ్, పనితీరును కలిగి ఉండనుంది. బహుశా అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ, మోటార్ కాన్ఫిగరేషన్ కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే, ఈ వివరాలకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ధృవీకరించలేదు.