అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి వచ్చే యత్నాలు దగ్గరపడ్డాయి. భార రహిత పరిస్థితుల్లో 9 నెలలున్న వారి ఆరోగ్యం కఠినమవుతుంది. పాదాలు చిన్న పిల్లల్లా(Baby Feet) తయారయ్యాయి. భూమిపై నడిస్తే గురుత్వాకర్షణ, రాపిడి రూపంలో పాదాలు చాలా నిరోధకతను ఎదుర్కొంటాయి. అరికాళ్లపై చర్మాన్ని మందం చేయడంతో మనం దృఢంగా ఉండగలుగుతాం. కానీ అక్కడ గడిపిన తర్వాత గట్టి చర్మం రాలిపోయి, పాదాలు మృదువుగా మారతాయి. మళ్లీ గట్టి చర్మాన్ని నిర్మించేవరకు నడక కష్టమవుతుంది. ఎముకల్లో సాంద్రత కుదుటపడాలంటే రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అంతరిక్షంలో ప్రతి నెలా బరువును తూస్తే ఒక శాతం అరుగుదుల ఉంటుంది.