17 గంటల తర్వాత భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ బృందం.. ISSలో 9 నెలల పాటు విస్తృత పరిశోధనలు చేసింది. మొత్తం 150కి పైగా ప్రయోగాలు నిర్వహించినట్లు నాసా(NASA) ప్రకటించింది. స్టెమ్ సెల్స్ టెక్నాలజీ, క్యాన్సర్లకు పరిష్కార మార్గాలు చూపే విధానాలపై పరిశోధనలు సాగించారు. ISS బయట కొన్ని నమూనాల్ని వ్యోమగాములు సేకరించారు. సునీత క్షేమంగా తిరిగి రావడంతో ఆమె పూర్వీకుల గ్రామం గుజరాత్ ఝులాసన్(Jhulasan)లో సంబరాలు చేసుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా(ISS)న్ని 15 దేశాలు తయారు చేయగా, నిర్వహణ కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చవుతుంది. నింగిలోని 400 కిలోమీటర్ల ఎత్తులో నిత్యం భూమిని చుట్టివచ్చే ISS.. ప్రకృతి విపత్తులు, భూవాతావరణంపై పరిశోధనలు సాగిస్తాయి. అక్కడ ఉండే వాతావరణం జీవసంబంధ ప్రయోగాలకు అనువుగా ఉంటుంది. కష్టంగా మారే వ్యాధులు, మెడిసిన్ పై ప్రయోగాలు, మానవ శరీరంలో మార్పులపై అధ్యయనం సాగుతుంది.