అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన నలుగురు వ్యోమగాములు భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు. వారు ప్రయాణించిన క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగగా.. దాన్ని ప్రత్యేక ఓడ(Ship) ద్వారా తరలించారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తోపాటు బుచ్ విల్మోర్.. భారత కాలమానం ప్రకారం 3:27 గంటలకు చేరుకున్నారు. స్పేస్ Xకు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ ద్వారా వారు పుడమి(Earth)పై అడుగుపెట్టారు. కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ సైతం అదే నౌకలో భూమికి విచ్చేశారు. 8 రోజుల యాత్ర కోసం 2024 జూన్ 5న ISSకు వెళ్లగా.. 286 రోజుల పాటు అక్కడే చిక్కుకోవాల్సి వచ్చింది.
పూర్తి స్టోరీ కోసం… https://justpostnews.com/it/austronauts-researches-at-iss/