మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో బజాజ్ కంపెనీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇప్పుడా స్పెషాలిటీని కాపాడుకుంటూ ప్రపంచంలోనే తొలి CNG(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)+పెట్రోల్ బైక్ ను అందుబాటులోకి తెచ్చింది. Freedom 125 పేరిట రాబోతున్న ఈ బైక్ ధర.. లక్ష లోపే అని కంపెనీ ప్రకటించింది. మూడు వేరియంట్లలో రానున్న ఈ బైక్ కు బుకింగ్స్ మొదలయ్యాయి.
వేరియంట్లు ఇవే…
మూడు వేరియంట్లకు గాను ఒక్కో వేరియంట్ కు ఒక్కో పేరు పెట్టారు. Drum, Drum LED, Disk LED పేర్లతో విడుదల కానుండగా, 7 డ్యూయల్-కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతాయి. కంపెనీ వెబ్సైట్ తోపాటు తమ డీలర్ల వద్ద బుకింగ్స్ చేసుకోవచ్చన్న బజాజ్.. మహారాష్ట్ర, గుజరాత్ లో మొదలయ్యాయని తెలిపింది.
5 స్పీడ్ గేర్ బాక్స్…
రెండు విధాలుగా నడిచేలా 2 లీటర్ల CNG ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సహా 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 9.5 hp వంటి సౌకర్యాలున్నాయి. KG CNGతో 102 కిలోమీటర్ల మైలేజ్ ఉంటుందని.. 125 సీసీ పెట్రోల్ బైక్ తో పోల్చితే రోజుకు 50% ఖర్చు ఆదా అవుతుందని, ఇది ఐదేళ్లకు రూ.75,000 అని కంపెనీ వివరించింది.
స్పెషాలిటీస్…
330 కిలోమీటర్ల రేంజ్, నెగెటివ్ LCD ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అదనపు ప్రత్యేకతలు. టాప్ ఎండ్ వెహికిల్లో స్పీడ్ కంట్రోల్ కు గాను డిస్క్ బ్రేక్, వెనుక టైర్ కు డ్రమ్ బ్రేక్ అమర్చారు. Freedom-125 స్టార్టింగ్ రేంజ్ రూ.95,000 అయితే మిడ్-ఎండ్, టాప్-ఎండ్ వేరియంట్లు రూ.1.05 లక్షల నుంచి రూ.1.10 లక్షల దాకా ఉండనున్నాయి.