ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పదేళ్ల పాలనా కాలంలో మూడోసారి భూటాన్(Bhutan) పర్యటన చేపట్టారు. రెండు రోజుల టూర్ లో భాగంగా రాజధాని థింపూలో.. భారత నిధులతో నిర్మించిన ఆసుపత్రి(Hospital)ని ప్రారంభించారు. అయితే తమ దేశంతో విస్తృత సంబంధాలు నెరపుతున్న భారత ప్రధానికి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది భూటాన్.
అత్యున్నత పురస్కారం…
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గ్యాల్పో’ను ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్ చేతుల మీదుగా అందుకున్నారు మోదీ. దీంతో ఈ పురస్కారాన్ని(Award) దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. అనంతరం ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం(Dedicated) చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఇరు దేశాల సంబంధాలకు…
భారత్-భూటాన్ సంబంధాల్ని బలోపేతం చేయడంతోపాటు కొవిడ్ సమయంలో 5 లక్షల టీకాలను అందించడాన్ని గుర్తు చేసుకుంటూ ఆ దేశం.. మోదీకి అవార్డు కట్టబెట్టింది. పర్యావరణం(Enviroment), వ్యవసాయం, పర్యాటకం(Tourism), పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. వాస్తవానికి ఈ నెల 21 నాడే మోదీ భూటాన్ వెళ్లాల్సి ఉన్నా ఒకరోజు ఆలస్యంగా అక్కడ అడుగుపెట్టారు.