
సాధారణ వ్యక్తి జీవితంలోని సుఖదుఃఖాలు, విషాదాలను నవలలో కళ్లకు కట్టిన డేవిడ్ సలాయ్ కి బుకర్ ప్రైజ్ దక్కింది. 51 ఏళ్ల ఈ హంగరీ-బ్రిటన్ రచయిత రాసిన ‘ఫ్లెష్’ నవలకు 2025-బుకర్ ప్రైజ్ ప్రకటించారు. లండన్ లోని ప్రఖ్యాత ఓల్డ్ బిల్డింగ్స్ గేట్ వేదికపై ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం(Award)తోపాటు 50 వేల పౌండ్ల నగదు బహుమతి అందజేశారు. ఆరుగురు రచయితల తుదిపోరులో ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. భారత రచయిత కిరణ్ దేశాయ్ కి 2025 ప్రైజ్ కొద్దిలో మిస్ అయింది. ఆరుగురు ఫైనలిస్టుల్లో ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ రాసిన కిరణ్ రెండో స్థానంలో నిలిచారు. అయితే భారత్ కు బుకర్ ప్రైజ్ కు మంచి అనుబంధమే ఉంది.
బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు వీరే…
వి.ఎస్.నైపాల్-1971(ఇన్ ఏ ఫ్రీ స్టేట్)
సల్మాన్ రష్దీ-1981(మిడ్ నైట్ చిల్డ్రన్)
అరుంధతిరాయ్-1997(ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్)
కిరణ్ దేశాయ్-2006(ద ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్)
అరవింద్ అడిగ-2008(ద వైట్ టైగర్)