BYD Seal Electric Car Launch : ప్రముఖ చైనీస్ ఆటోమేకర్, BYD కారు తయారీదారు భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తోంది. BYD సీల్ ఎలక్ట్రిక్ కారును మార్చి 5, 2024న లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ BYD సీల్‌ను మొదట ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. సీబీయూ మార్గం ద్వారా భారత్‌కు తీసుకురానుంది. ఈ కొత్త ఈవీ కారు ధరలు రూ.50 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని అంచనా. లాంచ్‌కు ముందే కొన్ని BYD డీలర్‌షిప్‌లు ఇప్పటికే సీల్ సెడాన్ కారు కోసం అనధికారిక(Unofficial) బుకింగ్‌లను ప్రారంభించాయి.
ఫుల్ ఛార్జింగ్‌కు 8.6 గంటల సమయం :
ఊహాగానాల ప్రకారం బీవైడీ సీల్ బ్యాక్.. యాక్సిల్‌పై అమర్చిన PMSM ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తోంది. 82.5kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చి ఉంటుంది. 230hp శక్తిని 360Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. WLTP ఫ్రేమ్‌లో 570km క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. బీవైడీ సీల్ ఈవీ కారు గంటకు 0 నుంచి 100kph వేగాన్ని 5.9 సెకన్లలో అందుకోగలదు. 150kW బ్యాటరీని 10-80 శాతం నుంచి ఛార్జ్ చేయడానికి కేవలం 37 నిమిషాలు పడుతుంది. అయితే, సాధారణ 11kW AC ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 8.6 గంటల సమయం పడుతుంది.
సీల్ సెడాన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
సీల్ ఈవీ కారు డిజైన్ గురించి మాట్లాడుతూ.. డిజైన్ ఓషన్ ఎక్స్ కాన్సెప్ట్ కారును అందిస్తోంది. ఈవీకి అన్ని గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్లు 4 బూమరాంగ్ ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, వెనుకవైపు పూర్తి వెడల్పు LED లైట్ బార్ ఉన్నాయి. కొలతల పరంగా ఈవీ పొడవు 4,800mm, వెడల్పు 1875mm, ఎత్తు 1460mm ఉన్నాయి. BYD సీల్ 50:50 బరువును కలిగి ఉంటుంది. సీల్ 2920mm వీల్ బేస్ కలిగి ఉంది. సీల్ ఈవీ అటో 3, E6 మాదిరిగానే రొటేటింగ్ భారీ 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈవీ 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లేను కూడా కలిగి ఉంది.
5-స్టార్ రేటింగ్ స్కోరు :
సీల్ యూరో ఎన్‌సీఎపీ ద్వారా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. సెడాన్ మోడల్ కారు కూడా పెద్దలు, పిల్లల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్ పొందింది. అడల్ట్(Adult) ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో EV 89 శాతం స్కోరు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 87 శాతం స్కోర్ చేసింది. ప్రమాదకర రహదారుల్లో వెళ్లే వినియోగదారుల్లో సెడాన్ 82 శాతం, భద్రతపరంగా 76 శాతం రేటింగ్ పొందింది. క్రాష్ పెర్ఫార్మెన్స్ సీల్ సెడాన్ యూరో ఎన్సీఏపీ ప్రకారం.. ఫ్రంటల్, లాటరల్, రియర్ ఇంపాక్ట్ టెస్ట్‌లకు ప్రధానంగా తగినంత రేటింగ్లను పొందింది.