రైలు పట్టాలపై కారు నడిపి.. రంగారెడ్డి జిల్లాలో యువతి హల్చల్ చేసింది. కొండకల్(Kondakal) లెవెల్ క్రాసింగ్ వద్ద కారు ట్రాక్ పైకి ఎక్కింది. గమనించి గేట్ మన్(Gateman) అరుస్తున్నా ఆమె పట్టించుకోలేదు. దీంతో అతడు పక్కనున్న స్టేషన్లకు ఫోన్లు చేసి రైళ్లను ఆపాల్సిందిగా కోరాడు. సదరు మహిళ UPలోని లఖ్‌నవూకు చెందిన రవికా సోనిగా గుర్తించి అరెస్టు చేశారు. నార్సింగిలో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. లెవెల్ క్రాసింగ్ వద్ద కారు దాటాల్సి ఉన్నా అలా చేయకుండా ట్రాక్ పైనే స్పీడ్ గా నడిపింది. ఆమెను దించే ప్రయత్నం చేస్తే కత్తితో బెదిరించింది. కానీ అక్కడున్న వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అటుగా వస్తున్న రైలులోని లోకో-పైలట్.. ఆ తతంగాన్ని చూసి బండిని నిలిపివేశారు. ఆమె నిర్వాకంతో గంటల తరబడి రైళ్లు నిలిచిపోవాల్సి వచ్చింది.