కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిప్ ల తయారీకి వీలుగా 4 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 6 సెమీకండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా, మరిన్నింటికి పచ్చజెండా ఊపింది. ఒడిశాలో సిక్ సెమ్, త్రీడీ గ్లాస్(SiCSem, 3D Glass), పంజాబ్ లో సీడీఐఎల్(CDIL), ఆంధ్రప్రదేశ్ లో ఏఎస్ఐపీ(ASIP) యూనిట్లు ఉంటాయి. వీటికి రూ.4,600 కోట్లు ఖర్చు కానుండగా.. మొత్తం 6 రాష్ట్రాల్లోని 10 ప్లాంట్లకు వెచ్చించే ఖర్చు రూ.1.60 లక్షల కోట్లు. టెలికాం, ఆటోమోటివ్, డేటాసెంటర్స్, కన్య్సూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు వీటి ద్వారా సేవలందుతాయి. కారు నడవాలన్నా, బస్సు కదలాలన్నా చిప్ లు అవసరం. ఇక విదేశాలపై ఆధారపడకుండా మనమే సొంతంగా వాటిని తయారు చేసుకోగలం.