
విద్య(Education)ను వ్యాపారం చేస్తామంటే కుదరదని CM రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. విడతలవారీగా అందరికీ నిధులిస్తామని, ఆలోపు విద్యార్థుల్ని ఇబ్బందిపెడితే సహించబోమన్నారు. అడిగినవి ఇవ్వట్లేదని కళాశాలలు మూసేస్తామంటే కుదరదని, బ్లాక్ మెయిల్ కు ప్రభుత్వం బెదరదన్నారు. ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకోవడం భ్రమేనని గట్టిగా హెచ్చరించారు . మీరు ఏ పార్టీతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివితక్కువవాళ్లం కాదన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కొత్తగా సమస్యలు వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అంతకుముందు ఇవి లేవా అని ప్రశ్నించారు.