
రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. మద్రాసు నుంచి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ రంగ ప్రముఖులు, కార్మికులతో భేటీ అయ్యారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే టాలీవుడ్ స్థాయిని మార్చివేస్తామన్నారు. ‘మా’ అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ స్టూడియోలు ఏర్పాటవడం కాంగ్రెస్ కృషికి నిదర్శనమన్నారు. చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ ముందడుగు వేస్తుందన్నారు.