ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండ్రోజులు భూమి కంపించింది. నిన్న 4.4, ఈరోజు 3.7 తీవ్రత నమోదైంది. హరియాణాలో ఝజ్జర్(Jhajjar)కు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఈ ఏడాదిలో తొలి భూకంపం ఫిబ్రవరి 17న వచ్చింది. ఇండియన్-యూరోషియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనే హిమాలయన్ బెల్ట్ లో ఉండటం వల్లే ఢిల్లీ పరిసర ప్రాంతాలు(NCR) ప్రమాదకర జోన్లో ఉన్నాయి. భారీ జనాభా, అడ్డగోలు కట్టడాలు, తవ్వకాలతో భూమి కంపిస్తుంటుంది. భూకంపాల జోన్ల పరంగా హస్తిన ‘హై రిస్క్ జోన్’లో ఉంది. కాలుష్యంతో ముక్కు మూసుకోవడం, భూకంపాల భయం రివాజుగా మారింది. అందుకే పర్యావరణాన్ని కాపాడాలంటారు. https://justpostnews.com