Apply Credit Card : మీకు క్రెడిట్ కార్డు కావాలా? క్రెడిట్ కార్డు ఎలా పొందాలో తెలుసా? సాధారణంగా నెలవారీ ఆదాయం పొందేవారికి మాత్రమే క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపిస్తుంటాయి. ఉద్యోగం లేదా బిజినెస్(Business) చేయని వారికి క్రెడిట్ కార్డు ఇవ్వవనే చెప్పాలి. కానీ, ఎలాంటి ఆదాయం, నెలవారీ జీతం(Salary) రాని వారు కూడా సులభంగా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని పొందడానికి కొన్ని నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉండాలి. చాలా క్రెడిట్ కార్డు జారీ కంపెనీలు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ చేసేందుకు కనీస జీతం ఉండాలని సూచిస్తున్నాయి.
మీరు ఉపయోగించే క్రెడిట్‌ను తిరిగి చెల్లించడానికి మీకు తగిన ఆదాయం(Income) ఉందో లేదో చెక్ చేస్తుంటారు. చెల్లింపులు సక్రమంగా చేస్తారనే నమ్మకం మీపై కలిగినప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు ఇస్తుంటారు. జీతం లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం అంత తేలికైన పని కాదు. అదృష్టవశాత్తూ, మీరు ఆదాయం లేకుండా క్రెడిట్ కార్డ్‌ని పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోండి :
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోండి :
జీతం లేకుండా క్రెడిట్ కార్డ్‌ని పొందడానికి మరో మార్గం.. యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని రిక్వెస్ట్ చేయడం. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రైమరీ క్రెడిట్ కార్డ్ ఉంటే.. జారీ చేసేవారు అదనపు కార్డ్‌ని అప్రూవల్ చేయొచ్చు. యాడ్-ఆన్, ప్రైమరీ కార్డ్ హోల్డర్ క్రెడిట్ లిమిట్ పెంచుకోవాల్సి ఉంటుంది. యాడ్-ఆన్(Add On) క్రెడిట్ కార్డ్‌ను జారీ చేసేవారు ప్రైమరీ కార్డ్ హోల్డర్ క్రెడిట్ స్కోర్(Credit Score), క్రెడిట్ హిస్టరీని మాత్రమే చెక్ చేస్తారు. తద్వారా మీ ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదని గమనించాలి.
సేఫ్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోండి :
ఆదాయం లేకుండా క్రెడిట్ కార్డ్‌ని పొందే ఇతర రెండు పద్ధతులు మీకు సరిపోకపోతే.. మీరు సురక్షితమైన వేరియంట్ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫండ్(Mutual Fund) వంటి కొలేటరల్పై జారీ చేసేవారు సురక్షితమైన క్రెడిట్ కార్డ్‌ను అందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ క్రెడిట్ కార్డు పొందడానికి మీరు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయవలసి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్‌కు అవసరమైన కనీస జీతం తీసుకుంటుంటే మాత్రం పరిమిత క్రెడిట్ హిస్టరీ కలిగినా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి కూడా ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
90 రోజుల వడ్డీ రహిత అత్యవసర రుణం :
మీరు క్రెడిట్ కార్డు పొందడానికి అవసరమైన ఆదాయాన్ని సంపాదిస్తుంటే.. బజాజ్ ఫిన్సర్వ్, RBL బ్యాంక్ సూపర్ కార్డ్ వంటి ఫీచర్-ప్యాక్డ్ క్రెడిట్ కార్డ్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఒక కార్డులో నాలుగు కార్డుల ఫీచర్లను పొందవచ్చు. తద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. క్రెడిట్ లావాదేవీలతో పాటు మీరు మీ క్రెడిట్ పరిమితి ఆధారంగా 90 రోజుల వడ్డీ రహిత అత్యవసర రుణాన్ని పొందవచ్చు. 50 రోజుల వరకు దేశంలోని ఏదైనా ఏటీఎం నుంచి వడ్డీ రహిత నగదు విత్‌డ్రా చేయవచ్చు. రూ.2,500 కన్నా ఎక్కువగా కొనుగోళ్లు చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఈజీ ఈఎంఐలు కూడా ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు నిబంధనలను పాటించడం ద్వారా కనీస డాక్యుమెంటేషన్‌తో మల్టీఫేస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు మీకు ఏమైనా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.