తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ‘TS’ నుంచి ‘TG’కి మార్పు చెందగా.. అది ఈరోజు(2024, మార్చి 15) నుంచి అందుబాటులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ‘TS’ స్థానంలో ‘TG’గా మార్చాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనల(Proposals)కు ఈనెల 12న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ‘TG’తోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చంటూ కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.
జిల్లా పేరు | రిజిస్ట్రేషన్ కోడ్ |
ఆదిలాబాద్ | TG 01 |
కరీంనగర్ | TG 02 |
హన్మకొండ | TG 03 |
ఖమ్మం | TG 04 |
నల్గొండ | TG 05 |
మహబూబ్ నగర్ | TG 06 |
రంగారెడ్డి | TG 07 |
మేడ్చల్ మల్కాజిగిరి | TG-08 |
హైదరాబాద్ | TG 09, 10, 11, 12, 13, 14 |
సంగారెడ్డి | TG 15 |
నిజామాబాద్ | TG 16 |
కామారెడ్డి | TG 17 |
నిర్మల్ | TG 18 |
మంచిర్యాల | TG 19 |
కుమురంభీమ్ ఆసిఫాబాద్ | TG 20 |
జగిత్యాల | TG 21 |
పెద్దపల్లి | TG 22 |
రాజన్న సిరిసిల్ల | TG 23 |
వరంగల్ | TG 24 |
జయశంకర్ భూపాలపల్లి | TG 25 |
మహబూబాబాద్ | TG 26 |
జనగామ | TG 27 |
భద్రాద్రి కొత్తగూడెం | TG 28 |
సూర్యాపేట | TG 29 |
యాదాద్రి భువనగిరి | TG 30 |
నాగర్ కర్నూల్ | TG 31 |
వనపర్తి | TG 32 |
జోగులాంబ గద్వాల | TG 33 |
వికారాబాద్ | TG 34 |
మెదక్ | TG 35 |
సిద్దిపేట | TG 36 |
ములుగు | TG 37 |
నారాయణపేట | TG 38 |