మ్యాప్ ద్వారా దారి చూపే సాధనంగా.. రివ్యూల ద్వారా వ్యాపారాల్ని(Business) నడిపే వేదికగా.. ఇంటర్నెట్(Internet)లో ఏది కావాలన్నా క్షణాల్లో వెతికిపెట్టగల సెర్చ్ ఇంజిన్ గా బహుముఖ(Different) పాత్రలు పోషిస్తున్న గూగుల్(Google)… ఇప్పుడు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నది. తను ఇచ్చిన రివ్యూలు కొంతమందికి ఇబ్బందికరంగా మారడంతో అలాంటి బాధితులంతా న్యాయస్థానం మెట్లెక్కారు. మొన్న అమెరికా వాసులు కోర్టు మెట్లెక్కితే ఇంకో కేసులో ఇప్పుడు జపాన్ దేశస్థులు సైతం కేసు వేశారు.
అక్కడే ఎందుకు…
గూగుల్ అందించే రివ్యూలకు జపాన్(Japan) దేశంలో విపరీతమైన పాపులారిటీ(Popularity) ఉంటుంది. జపాన్ దేశ ప్రజలు ఏదైనా సేవల్ని పొందాలంటే ముుందుగా గూగుల్ రివ్యూలనే పరిగణలో(Countable)కి తీసుకుంటారు. హాస్పిటల్ కు వెళ్లాలన్నా, ఎక్కడ డాక్టర్లు బాగా చూస్తారు అన్నవి కూడా రివ్యూల ఆధారంగానే వెళ్తుంటారు. అయితే ఇలా ఇచ్చే రివ్యూలు తమ కొంప ముంచుతున్నాయని జపాన్ దేశంలోని డాక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. ఇవి ఒకరకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టులో దావా(Suit) వేశారు.
డాక్టర్లు ఇలా…
అతి సున్నితమైన హెల్త్ కేర్ విషయంలో అసంబద్ధ(Unmoderated) రివ్యూల వల్ల గందరగోళం ఏర్పడిందన్నది అక్కడి డాక్టర్ల వాదన. హెల్త్ కేర్ ప్రొవైడర్ వెబ్ సైట్లు కొన్ని దేశాల్లో బాగానే పనిచేస్తున్నా రివ్యూల సిస్టమ్ పై జపాన్ ఆధారపడుతున్నంతగా ఏ దేశమూ ఫాలో కావట్లేదు. గూగుల్స్ ఇచ్చే రిపోర్టులు ఫాల్స్(False), నెగెటివ్(Nagative)గా ఉండటంతోపాటు గొప్ప(Famous) డాక్టర్ల సేవలను దెబ్బతీస్తున్నాయన్నది ఆరోపణ. ఇలాంటి తప్పుడు రివ్యూల వల్ల వైద్యవృత్తి ప్రమాదంలో పడుతుందన్నది కేసులో వాదన. గూగుల్ వీటిని కట్టడి చేయకపోవడం, వాటినే నమ్ముకోవడం వల్ల చాలా మందికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ల సేవలు దొరక్కుండా పోతున్నాయని అంటున్నారు.