అక్రమాలకు పాల్పడ్డారన్న కోణంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED)… VVIPలను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత వంటి ముఖ్య నేతల్ని అరెస్టు చేసి ED.. మరో ముఖ్యమంత్రి కుమార్తెపైనా కేసు ఫైల్ చేసింది. ఐటీ కంపెనీ ద్వారా ఎలాంటి లావాదేవీలు లేకున్నా ఒక కంపెనీకి నిధుల్ని మళ్లించారంటూ మనీలాండరింగ్(PMLA) కింద కేసు పెట్టింది.
ఆయన కుమార్తె…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్ పైనే ఈ కేసు దాఖలైంది(Case Booked). వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్(Exalogic Solutions) కంపెనీ.. కొచ్చిన్ మినరల్స్ రుటైల్ లిమిటెడ్(CMRL)కు రూ.1.72 కోట్లు బదిలీ చేసినట్లు దర్యాప్తులో ED గుర్తించింది. అయితే CMRL నుంచి ఎలాంటి సర్వీసులు పొందకుండా ఈ నగదును పంపినట్లు తేల్చింది. ఎక్సలాజికల్ సొల్యూషన్స్ అనే IT కంపెనీ పేరిట 2018-19 సంవత్సరానికి రూ.1.72 కోట్లు CMRLకు ట్రాన్స్ ఫర్ అయినట్లు ED ఆరోపించింది.
కర్ణాటక హైకోర్టులో…
వీణా విజయన్ కంపెనీపై కంప్లయింట్ రావడంతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) ఆధ్వర్యంలో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్స్(IT) ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇది రూ.50 లక్షలకు మించిన కేసు కావడంతో ED ఎంటరైంది. అయితే SFIO ఇన్వెస్టిగేషన్ ను ఆపాలంటూ వీణా విజయన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.