కార్లు, బైకుల మాదిరిగానే ఎలక్ట్రిక్(Electric) విమానాలు వచ్చేశాయ్. రావడమేంటి.. ఏకంగా నింగిలో విహరించింది. అమెరికాలోని ఈస్ట్ హాంప్టన్ నుంచి న్యూయార్క్ జాన్ ఎఫ్.కెనడీ విమానాశ్రయం వరకు ప్రయోగాత్మకంగా నడిపారు. 100% విద్యుత్తుతో నడిచే ఈ విమానాన్ని బీటా(Beta) టెక్నాలజీస్ తయారు చేసింది. నలుగురితో కేవలం 35 నిమిషాల్లోనే 130 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇందుకు అయిన ఖర్చు 8 డాలర్లు(రూ.694) మాత్రమే. అదే హెలికాప్టర్ లో వెళ్లాలంటే 160 డాలర్లు(రూ.14 వేలు) అయ్యేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 463 కిలోమీటర్లు తిరుగుతుంది. 2017లో బీటా టెక్నాలజీ కంపెనీ ప్రారంభం కాగా, ఎలియా CX-300 మోడల్ ఫ్లైట్లను తయారు చేస్తోంది. https://justpostnews.com