Published 25 Jan 2024
Tech Tips and Tricks : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? అయితే మీరు జీమెయిల్ నుంచి ఎప్పుడైనా మెసేజ్ పంపుకోవచ్చు. కొన్సిసార్లు మీకు ఒక నిర్ధిష్టమైన సమయాల్లో మెయిల్ పంపాల్సి రావొచ్చు. అలాంటి సమయాల్లో మెయిల్ ఎలా పంపాలో చాలామందికి అవగాహన ఉండదు. సాధారణంగా అప్పటికప్పుడు మెయిల్ పంపడం మాత్రమే తెలిసి ఉంటుంది. అర్థరాత్రి ఇమెయిల్‌లు లేదా బయటకు వెళ్లిన సమయాల్లో ఇమెయిల్ పంపాలంటే కుదరకపోవచ్చు. అందుకే.. ఈ సింపుల్ టిప్స్ ద్వారా ఏ సమయంలోనైనా మీ జీమెయిల్ నుంచి ఇమెయిల్ చాలా సింపుల్‌గా పంపుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. షెడ్యూల్ ఆప్షన్ ఎనేబుల్ చేయడమే.. ముందుగా మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు మీకు ఇన్‌బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కంపోజ్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి ఇమెయిల్ ఎంటర్ చేయండి. ఎందుకు పంపుతున్నారు? ఏంటి అనే వివరాలను సబ్జెక్ట్ లైనులో రాయండి. పంపే అంశానికి సంబంధించి అన్ని వివరాలను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు షెడ్యూలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత అది ఆటోమాటిక్‌గా మీరు సెట్ చేసిన భవిష్యత్తు సమయం, తేదీ ప్రకారం ఆ సమయానికి సెండ్ అవుతుంది. మీరు రోజు ఎన్ని ఇమెయిల్స్ అయినా షెడ్యూల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
జీమెయిల్లో ఇమెయిల్‌లను ఎలా షెడ్యూల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
- మీ ఇమెయిల్‌ను కంపోజ్ చేయండి.
- మీరు సాధారణంగా పంపే విధానంలోనే కొత్త ఇమెయిల్‌ను క్రియేట్ చేయండి.
- మీ మెసేజ్ పంపేవారి ఇమెయిల్, సబ్జెక్ట్ లైన్ బాడీలో అవసరమైన వివరాలను నింపండి.
- ‘Schedule Send’ ఆప్షన్ ఎంచుకోండి.
- దిగువ ఎడమ మూలలో బ్లూ కలర్ ‘Send’ బటన్ పక్కన కిందిభాగంలోని యారోపై క్లిక్ చేయండి.
- కనిపించే ఆప్షన్లలో ‘Schedule Send’ ఆప్షన్ ఎంచుకోండి.
*. మీ ఇమెయిల్ పంపే సమయాన్ని కూడా ఎంచుకోండి. - ముందుగా సెట్ చేసిన టైమ్ ఆప్షన్లు (ఉదాహరణ, రేపు ఉదయం, వచ్చే వారం) క్యాలెండర్‌తో పాప్-అప్ విండో కనిపిస్తుంది.
- మీకు సరిపోయే సమయాన్ని ఎంచుకోండి లేదా నిర్దిష్ట తేదీ, గంటను ఎంచుకోవడానికి ‘Pick date & time’ క్లిక్ చేయండి.
- షెడ్యూలింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి.
- నిర్ధారించడానికి ‘Schedule Send’ క్లిక్ చేయండి.
- మీ ఇమెయిల్ ఇప్పుడు షెడ్యూల్ చేసిన సమయం వరకు (Drafts) ఫోల్డర్లో సేవ్ అవుతుంది.
మరిన్ని టిప్స్ మీకోసం :
- ఎడిట్ చేయండి లేదా క్యాన్సిల్ చేయండి : మార్పులు చేయడానికి లేదా ఇమెయిల్ పంపడాన్ని రద్దు చేయడానికి మీరు ‘sent‘ కింద మీ ‘షెడ్యూల్డ్’ ఫోల్డర్లో షెడ్యూల్ చేసిన ఇమెయిల్‌లను యాక్సెస్ చేయవచ్చు.
- మొబైల్ షెడ్యూలింగ్ : కంపోజ్ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న త్రి డాట్స్ నొక్కడం ద్వారా జీమెయిల్ మొబైల్ యాప్‌లో షెడ్యూలింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.
- థర్డ్-పార్టీ యాడ్-ఆన్ : అధునాతన షెడ్యూలింగ్ ఫీచర్ల కోసం బూమరాంగ్ (Boomerang) లేదా రైట్ ఇన్‌బాక్స్ (Right Inbox) వంటి థర్డ్-పార్టీ యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.